Telugu Poets
Few of greatest Telugu poets and their history.
ఇతఁడు బళ్లారి కడప జిల్లాలప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను
Maha Kavi Sri Sri:
Srirangam srinivasarao 1910-1983, hailed from vishakapatnam.
Sri Sri was the first President of Andhra Pradesh Civil Liberties Committee that was formed in 1974
some of his writings:
Nenoka durgam, nadoka swargma, anargalam, anitharasadhyam naa margam.
Kooti kosam, kooli kosam
Pattanamlo brathukudamani
Thalli maatalu chevina pettaka
Bayaluderina baatasariki
Entha kashtam, entha kashtam
నన్నయ్య
మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ. ఆదికవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు
నన్నయ వేగిదేశమునకి రాజైన virata ఆస్థాన కవి. పూర్వము ఆంధ్రదేశమునకు వేగిదేశమని పేరు వ్యవహారము ఉంది. నిజమైన వేగిదేశము 8000 చదరపుమైళ్ళ వైశాల్యం కలిగి ఉండేది. పడమటన తూర్పుకనుములకు, తూర్పున సముద్రమునకు, ఉత్తరాన గోదావరినదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యస్థమయిన తెలుగుదేశము అను వేగిదేశము గలదు. ఈ వేగిదేశమునకు వేగి అను పట్టణము రాజధానిగా ఉండెను. ఈ వేగిపురమునుపరిపాలిస్తున్న రాజరాజమహేంద్రుని బట్టి ఈ నగరానికి రాజమహేంద్రవరము అనే పేరు వచ్చింది.
నన్నయ చిత్రపటం picture
| |
జననం | తణుకు |
---|---|
నివాస ప్రాంతం | రాజమహేంద్రవరం |
ఇతర పేర్లు | నన్నయ భట్టు, నన్నయ భట్టారకుడు, నన్నయ |
వృత్తి | కవి, రాజరాజనరేంద్రుని కులబ్రాహ్మణుడు |
ప్రసిద్ధి | ఆదికవి, మహాభారత కర్త |
తిక్కన
తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు.కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.
ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.
మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్దికి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించాడు.
ఎఱ్రాప్రగడ
ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్నభారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.
సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎర్రయ్యను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
ఎర్రన బహుశా క్రీ.శ. 1280లో జన్మించి, 1364వరకు జీవించి ఉంటాడని సాహితీచరిత్రకారులు అంచనా వేస్తున్నారు. (కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి కందుకూరు మొదలు గోదావరీతీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు). ఆ సమయంలోనే ఎర్రన 45ఏండ్ల వయసుగల ప్రౌఢకవి ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవి అయ్యాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు.
శ్రీనాథుడు
శ్రీనాథుడు సింహాచలం నుండి ద్రవిడ కర్ణాట సీమల వరకు, కృష్ణాతీరపు బొడ్డుపల్లి నుండి శ్రీశైలం వరకు ఉత్తర దక్షిణాలుగా తూర్పుపడమరలుగా తిరిగాడు. మాచర్ల, పల్నాడు, కారెంపూడి, గురజాల లాటి చోట్ల ఉన్నాడు. త్రిలింగాల్ని దర్శించాడు. కొండవీడు, అద్దంకి, మారెళ్ళ, ఇంకా ఎన్నో చిన్నా పెద్దా ప్రదేశాల్లో ఉన్నాడు.
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్సింగ్భూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు.
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము ఉంది.
శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాథును ప్రభ మసకబారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా ఊరేగించారని ఆయన చరమ పద్యం ద్వారా తెలుస్తుంది.
అల్లసాని పెద్దన్న:
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.ఇతఁడు బళ్లారి కడప జిల్లాలప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను
అల్లసాని పెద్దన | |
జననం | 15, 16 శతాబ్దాల నడుమ బళ్ళారి మండలం, దోరాల (దోర్ణాల) గ్రామం |
---|---|
ఇతర పేర్లు | ఆంధ్ర కవితా పితామహుడు |
రచనలు | స్వారోచిషమనుసంభవములేదా మనుచరిత్ర |
గురువు | శఠగోపయతి |
ఆశ్రయమిచ్చిన రాజులు | శ్రీ కృష్ణదేవ రాయలు |
ఆతుకూరి మొల్ల
ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణము గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలుసమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.
విషయ సూచిక
జీవిత కాలము[మార్చు]
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు.వంగడమునుబట్టి కుమ్మరి మొల్ల అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనపెట్టి. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాధుడుని స్మరించియుండుటచే ఈమె శ్రీనాధుడు తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.
తెనాలి రామకృష్ణుడు
తెనాలి రామకృష్ణుడు | |
---|---|
175px
తెనాలి రామలింగ కవి
| |
జననం | Garalapati Ramakrishna
16th century
Garalapadu, Guntur District Andhra Pradesh, India |
మరణం | హంపి |
ఇతర పేర్లు | తెనాలి రామలింగ కవి |
వృత్తి | కవీశ్వరులు |
ప్రసిద్ధి | వికటకవి, అష్టదిగ్గజాలలో ఒకరు |
సాధించిన విజయాలు | శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థాన కవీంద్రులు |
పదవీ కాలము | 15వ శతాబ్దం |
మతం | శైవ స్మార్తం నియోగి బ్రాహ్మణులు |
తల్లి | లక్ష్మమ్మ |
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగువారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలినుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు.[1] రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. క్రీ.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.
హరిభట్టు
ఖమ్మం జిల్లా సాహితీ రంగంలో హరిభట్టు ముందువరుసలో వుంటారు. ఈయన ఖమ్మంజిల్లా ఆదికవిగా పేరుగాంచారు. హరిభట్టు పూర్తిపేరు ‘హరిహరభట్టు’ తండ్రి పేరు రాఘవరామచంద్ర చట్టోపాద్యాయులు, ఛటోపాద్యాయ అనేది ఇంటిపేరు కాదు. వీరి తండ్రిగారిని కొందరు రాఘవయ్య అనికూడా పిలిచే వారు. తల్లి తిమ్మమ్మ (తిమ్మమాంబ) ఈయన భారద్వాజ గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు.
ఇతని కాలం క్రీ.శ 1475 - 1535 మధ్యకాలం నాటివాడని ఆంధ్రకవి తరంగిణిని రచించిన చాగంటి శేషయ్యగారు నిర్ణయనిర్ధారణ చేసారు.
ఈయన మత్స్య పురాణము, వరాహ పురాణము, నారసింహ పురాణము మొదలైన పురాణాలను ఆంధ్రీకరించడమే కాక స్వయంగా సంస్కృత భాషలో కూడా గ్రంథాలను రచించారు
మండపాక పార్వతీశ్వర శాస్త్రి
మండపాక పార్వతీశ్వర శాస్త్రి | |
---|---|
జననం | 30 జూన్, 1833 పాలతేరు |
మరణం | 30 జూన్, 1897 |
తల్లిదండ్రులు |
|
మండపాక పార్వతీశ్వర శాస్త్రి (జూన్ 30, 1833 - జూన్ 30, 1897) పేరెన్నికగన్న సంస్కృతాంధ్ర కవి, పండితులు. వీరు శతాధికాలైన కృతులను రచించారు.
ఇతని తండ్రి మండపాక కామకవి మరియు తల్లి జోగమాంబ. ఈతని పితామహుడు మండపాక పేరయసూరి. వీరు 1875లో బొబ్బిలి ప్రభువైన శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు ఆస్థానకవిగా చేరి జీవితాంతం అచటనే ఉన్నారు. .
Srirangam Srinivasa Rao
| |
---|---|
Sri Sri
| |
Born |
Srirangam Srinivasa Rao
30 April 1910 |
Died | 15 June 1983 (aged 73) |
Other names |
Sri Sri was the first President of Andhra Pradesh Civil Liberties Committee that was formed in 1974
some of his writings:
Nenoka durgam, nadoka swargma, anargalam, anitharasadhyam naa margam.
Maro prapancham,
Maro prapancham,
Maro prapancham pilichindi!
padanDi munduku,
padanDi trosuku,
podaam, podaam, pai paiki!Pattanamlo brathukudamani
Thalli maatalu chevina pettaka
Bayaluderina baatasariki
Entha kashtam, entha kashtam
pathithulara bhrastulara badha sarpa dastulara
daga padina thammulara edavakedavakandi
jagannatha ratha chakralu vastunnayi vastunayi
ratha chakra pralaya gosha bhoo margam pattistanu
bhoo kampam puttistanu...!!
daga padina thammulara edavakedavakandi
jagannatha ratha chakralu vastunnayi vastunayi
ratha chakra pralaya gosha bhoo margam pattistanu
bhoo kampam puttistanu...!!
Comments