Telugu Proverbs

Some excellent proverbs I liked in telugu....

Happy Reading !!!

బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు
బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
మందుకని పంపిస్తే మాసికం నాటికి వచ్చే రకం
మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది
రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట
లంఖణం చెయ్యమంటేనే ఉపవాసానికి ఒప్పుకున్నట్టు
వంగలేక మంగళవారం అన్నాడంట
వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట
శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
సూది కోసం సోది కెళితే పాత రంకంతా బయట పడిందిట
పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేలు లెక్కెసు కుందట
పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
తోచీ తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
తిట్టను పోరా గాడిదా అన్నట్టు
తవుడు తింటూ వయ్యారమా?
తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
డబ్బు లేని వానికి బోగముది తల్లి వరస
జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
ఛారాన కోడికి బారాన మసాల.
చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
కణత తలగడ కాదు. కల నిజం కాదు
కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
ఏనుగులు పడితే ఏనుగులే లేపాలి కాని పీనుగుల వల్ల కాదు
ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం
అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న
అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం

Comments

Kirinchi said…
సాయంకాలము. అబ్బాయికేమో అమ్మాయిని చూడాలని, అమ్మాయితో మాట్లాడాలని ఆశ. ఇంటికి ఎదురుగా నిల్చుకొని ఆమెను ఆకర్షించ వలెనని ఎంతో ఉత్సాహముతో ఈలపాట
పాడుతున్నాడు. అమ్మాయి పాట విన్నది, మేడ కిటికినుండి అబ్బాయిని చూసింది. కాని భయం.నాన్నగారు అప్పుడే ఆఫీసునుండి వచ్చి కాఫీ త్రాగుతూ టీవీ చూస్తున్నారు. అమ్మ వారితో మాట్లాడుతూ
తమ్ముడికి నీతులు బోధిస్తూ వంట పనులు చూస్తూ అన్ని చోట్ల కళ్ళను చెవులను ప్రసరిస్తూ ఉంది. ఆబాయి ఈల పాట తగ్గలేదు, ఉత్సాహము తగ్గలేదు. ఇక ముప్పు తప్పదని అమ్మాయి ఒక కాగితముపై తన సమస్యను వర్ణిస్తూ ఒక పద్యము వ్రాసి ఒక లాలీపాప్కు ఆ కాగితము చుట్టి కిటికీనుండి అబ్బాయి పాదాలకు తగిలేటట్లు వేసింది. అబ్బాయి కాగితము వీపి అంతా చదివి అప్పటికి ఈలపాటను
ముగించి మెల్లగా అడుగులు వేసుకొంటూ తిరిగి వెళ్ళాడు.


చాలుర యీల పాట, యిక చాలును చాలును సంధ్య వేళలో,
తాళగ జాల నేను, విను, తల్లియు తండ్రియు విన్న ముప్పురా,
పాలను తేనె గల్పి, యొక పాటను పాడి, రమించ, రేపు నీ
కేలను నిత్తు, నమ్ము నను, కేళిక కింకను స్వస్తి జెప్పవా!
Kirinchi said…
babu jayanthi,

"jayadeva ashtapadi" gurinchi emanna try cheyagalava?

Kanchi Ravi

Popular posts from this blog

Dhirubhai Notorious or Famous???????

Sri Sri kavitha

Excerpt from the book "Made to Stick"